పుత్తూరు నియోజకవర్గం మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడి చిన్న కుమారుడు

పుత్తూరు నియోజకవర్గం మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడి చిన్న కుమారుడు, టీడీపీ నేత గాలి జగదీశ్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఎల్లుండి మాజీ సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నగరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భానుప్రకాశ్ సోదరుడే పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీశ్‎ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.వైసీపీలోకి చేర‌నున్నార‌ లేదా అన్నది రెండు,మూడు రోజుల్లో క్లారిటీ రానుంది..!

Updated On
ehatv

ehatv

Next Story