Ganta SrinivasaRao: గంటా శ్రీనివాసరావు దారెటు
తాను అనుకున్న స్థానంలో బరిలోకి దింపకపోతే పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయనే
టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు పరిస్థితి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ తనకు ప్రతిపాదన పంపిందని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంటా శ్రీనివాసరావు అన్నారు.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేశానని, ఇతర జిల్లాల నుంచి ఎప్పుడూ పోటీ చేయలేదని ఓ వారం కిందట గంటా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నానని గంటా అన్నారు. అయితే ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే గంటా ఉన్నారు.
తాను అనుకున్న స్థానంలో బరిలోకి దింపకపోతే పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కొందరు విజయనగరం నాయకులు నన్ను స్వాగతిస్తున్నారని.. కానీ నేను దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించానని గంటా అన్నారు. అందరితో చర్చించాక నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని గంటా చెప్పినప్పటికీ.. ఆయన మనసులో ఉమ్మడి విశాఖ జిల్లాను దాటి వెళ్లాలని కూడా లేదు. చీపురు పల్లిలో టీడీపీ నిలబెట్టినా కూడా అక్కడి స్థానిక నాయకులు.. ఎంతో బలంగా ఉన్న జనసేన నేతలు తనకు సహకరిస్తారా.. లేదా అనే అనుమానాలు కూడా గంటా శ్రీనివాస రావుకు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఆసక్తి కూడా నాయకుల్లో ఉంది.