తనను పట్టించుకోవడం లేదని ఓ ప్రియురాలు(Girlfriend) తన ప్రియుడిని(Boyfriend) కిడ్నాప్(kidnap) చేసిన ఘటన కలకలం సృష్టించింది.

తనను పట్టించుకోవడం లేదని ఓ ప్రియురాలు(Girlfriend) తన ప్రియుడిని(Boyfriend) కిడ్నాప్(kidnap) చేసిన ఘటన కలకలం సృష్టించింది. తిరుపతి జిల్లాలో(Tirupathi) ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్‌ ఇంచార్జి సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలోని పీకే లేఔట్‌లో(PK Layout) ఓ లాడ్జిని నడుపుతున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన యువతి భానుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి కొన్ని నెలలపాటు సన్నిహితంగా మెలిగారు. అయితే గత మూడు నెలల నుంచి తనను భాను పట్టించుకోవడంలేదని కోపం పెంచుకున్న భాను మరో నలుగురి సాయంతో కిడ్నాప్‌నకు ప్రయత్నించింది. మదనపల్లి నుంచి వెళ్లి పీకే లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ చేయించింది. కిడ్నాప్‌ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో వాయల్పాడు వద్ద ఇన్నోవాను అడ్డగించి నానిని కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో భాను సహా ఇతర నిందితులపై కేసు నమోదు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story