డిప్యూటీ పవన్ కళ్యాణ్‌కు(Pawan kalyan) నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్(Prakash Raj) మధ్య ట్విట్టర్ వేదికగా ఒక సలహా ఇచ్చారు.

డిప్యూటీ పవన్ కళ్యాణ్‌కు(Pawan kalyan) నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్(Prakash Raj) మధ్య ట్విట్టర్ వేదికగా ఒక సలహా ఇచ్చారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో(Tirumala laddu) పశువుల కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు మరియు బీఫ్ కొవ్వు కలుపుతున్నట్లు వచ్చిన వార్తలపై పవన్ కల్యాణ్ ఎక్స్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, "తిరుపతి బాలాజీ ప్రసాదంలో పశువుల కొవ్వు కలుపుతున్నారనేది చాలా బాధాకరం" అని అన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న విషయం అంటూ, పవన్ ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

దీనికి ప్రతిస్పందనగా ప్రకాశ్ రాజ్ అదే ఎక్స్ వేదికగా పవన్‌ను ప్రశ్నించారు. "మీరు ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అక్కడే ఈ ఘటన జరిగింది. మీరు విచారణ చేయాలి. కానీ ఇలాంటి విషయాలను జాతీయ స్థాయిలో చర్చ జరగడానికి కారణం అయ్యి శాంతి భద్రతను ప్రశ్నించడం సమంజసం కాదు"

వీరిమధ్య ట్వీట్ వార్‌ నడుస్తుండగా మా(MAA) అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌పై పోటీ చేసి గెలిచిన మంచు విష్ణు(Manchu vishnu) కలగజేసుకున్నారు. ప్రకాష్‌రాజ్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆయన ట్వీట్‌లో 'తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అటువంటి పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అనడంలో కరెక్టే. ఇందులో మతపరమైన అంశం ఎక్కడ వచ్చిందన్నారు. దీనికి కూడా ప్రకాష్‌రాజ్‌ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. 'శివయ్యా.. నా అభిప్రాయం నాది.. మీ అభిప్రాయం మీది.. నోటెడ్' అంటూ మరో ట్విట్ పడేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story