High Court orders: 6 నెలల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు జీతాలు: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం..!
High Court orders: 6 నెలల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు జీతాలు: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం..!

పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్‌కు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ దివాలాపై హైకోర్టులో అధికారులు చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి తమకు రావలసిన గౌరవ వేతనం ఇవ్వడం లేదు అంటూ కడప జిల్లాకు చెందిన జెడ్పీటీసీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యంపై వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ప్రజా ప్రతినిధులుగా ఉన్న జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఎందుకు గౌరవ వేతనం చెల్లించడం లేదో వివరణ ఇవ్వాలి అంటూ గతంలో హైకోర్టు ఆదేశం. తమ దగ్గర నిధులు లేని కారణంగా గౌరవ వేతనం చెల్లించలేకపోయామంటూ హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసిన పంచాయితీరాజ్ శాఖ సీఈవో. ఈ ప్రమాణ పత్రాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది. రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ వేతనాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో జెడ్పీటీసీలకు ఇవ్వవలసిన గౌరవ వేతనం బకాయిలు ఆరు వారాల్లోపు చెల్లించండి హైకోర్టు ఆదేశం. హైకోర్టు ఆదేశాలతో అయినా గౌరవ వేతనాలు చెల్లిస్తారో లేదో అంటూ పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేశారు. నెలకు 6000 ఇవ్వవలసిన గౌరవ వేతనం ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకు పోతుంది అంటూ తమ బాధను వ్యక్తం చేసినన పిటిషనర్.


