High Court's big shock to Jana Sena Party: జనసేన పార్టీకి హైకోర్టు బిగ్ షాక్..! శ్రీశివానీ కాలేజీతోటి మీకేంటి ఒప్పందం పవన్ కల్యాణ్ అన్న న్యాయవాది..!
High Court's big shock to Jana Sena Party: జనసేన పార్టీకి హైకోర్టు బిగ్ షాక్..! శ్రీశివానీ కాలేజీతోటి మీకేంటి ఒప్పందం పవన్ కల్యాణ్ అన్న న్యాయవాది..!

శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందిన మువ్వల నగేష్ మృతి కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2021 వ సంవత్సరంలో 19 సంవత్సరాల మత్స్యకారు కుటుంబానికి చెందిన మువ్వల నగేష్ అనుమానస్పదంగా మృతి చెందాడు. మువ్వల నగేష్ మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారని తన బిడ్డ రిపోర్ట్ చేసిన కారణంగానే కాలేజీ యాజమాన్యం వారే కొట్టి చంపేశారు అంటూ మృతుని తల్లిదండ్రులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు పూర్తిస్థాయి మద్దతునిచ్చిన జనసేన పార్టీ. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని మృతుని కుటుంబంతో పాటుగా కొన్ని నెలలపాటు కాలేజీ ముందు జనసేన అగ్ర నేతలు అంతా పోరాటం చేశారు. జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మృతుని తల్లిదండ్రులను పరామర్శించి నిందితులకు శిక్ష పడే విధంగా తమ పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ శివానీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ దోనేటి శ్రీధర్ జనసేనలో చేరాడు. కాలేజీ యాజమాన్యం జనసేనలో చేరినప్పటి నుండి కేసు పరిస్థితి పూర్తిగా రివర్సయింది. కాలేజీ యాజమాన్యం ఎటువంటి తప్పు చేయలేదు అంటూ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కేవలం ప్రేమ విఫలం కారణంగానే మువ్వల నగేష్ చనిపోయాడు అంటూ పోలీసుల ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. కోట్లాది రూపాయల పార్టీ ఫండ్ తీసుకొని నిందితులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.
పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన మృతుని తల్లి మువ్వల సుందరి. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా తమకి ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని ఈ కేసును సీబీఐకి బదలాయించాలని మృతుని తల్లి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ప్రముఖ న్యాయవాది దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించి విచారించింది హైకోర్టు. కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదంటూ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగలేదని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కేసు డైరీ, ఫోటోలు, విచారణకు సంబంధించిన అన్ని రికార్డులతో టెక్కిలి సిఐ తమ ముందు హాజరుకావాంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. విచారణ ఎస్పీ స్థాయి అధికారులతో ఎందుకు కొనసాగించకూడదో తెలపాలంటూ ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రమాద స్థలం నుంచి సేకరించిన రక్తపు మరకల రిపోర్టు రాకుండానే ఎలా ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు. తదుపురి విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సిబిఐ ద్వారానే తమకు న్యాయం జరుగుతుంది అంటున్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. బాధిత కుటుంబాలను దగ్గర చేర్చుకొని తద్వారా నిందితుల దగ్గర డబ్బులు తీసుకునే సంస్కృతి ద్వారా బాధితులు న్యాయం పట్ల నమ్మకం కోల్పోతున్నారని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ నఅన్నారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. నిండితులు ఎంతటి వారైనా చట్టం ముందుకు తీసుకొస్తామని, శ్రీ శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని కచ్చితంగా బయటపెడతామని జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.


