చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

తిరుమల లడ్డూ(Tirumala laddoo) విషయంలో పచ్చి అబద్ధాలు ఆడి, హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలంటూ దేశ వ్యాప్తంగా ఎక్స్‌ (ట్విట్టర్‌)లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 'చంద్ర‌బాబు హిందువులకు క్షమాపణ చెప్పండి' అనే హాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ లో ట్రెండింగ్ జరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. కల్తీ జరిగిందనడం కంటే జంతువుల కొవ్వు కలిపారంటూ దరిద్రపుగొట్టు వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ వివాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. దీంతో ఆయన హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ఊపందుకుంది. ఎక్స్‌లో చాలా మంది నేతలు, భక్తులు, హిందూ సంఘాలు చంద్రబాబును తిట్టిపోస్తున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story