Hypocrisy in Women's Honor: అడ్డంగా బుక్కయిన చంద్రబాబు..!
Hypocrisy in Women's Honor: అడ్డంగా బుక్కయిన చంద్రబాబు..!
సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వీడియోలు నా ఛానల్ లో అందుబాటులో ఉన్నాయి. ఆయన మాట్లాడిన ఇంకొక మాట గురించి కూడా చంద్రబాబు నాయుడు, దానిలోని రెండవ కోణాన్ని గుర్తు చేయడం కోసం వీడియో చేస్తున్నాను. ఆయన చెప్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల గురించి తప్పుగా మాట్లాడితే తాట తీస్తున్నాం, తమ్ముళ్ళు ఎవరైనా అలా మాట్లాడితే కొద్ది గంటల్లోనే పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తున్నారు, శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు, ఏం తమ్ముళ్ళు లాండ్ ఆర్డర్ అవసరమా లేదా, ఆడబిడ్డల్ని గౌరవించాల్నా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వారిని శిక్షించాల్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడికి వచ్చిన కార్యకర్తలతో పాటు నేను కూడా చప్పట్లు కొట్టి చెప్పగలను, ఆడబిడ్డల గురించి తప్పుడుగా పోస్టులు పెట్టేవాళ్ళని, తప్పుగా మాట్లాడే వాళ్ళని శిక్షించాల్సిందే. చంద్రబాబు నాయుడుని సమర్థిద్దాం, కానీ ఎక్కడి నుండి మాట్లాడారు ఆయన ఆ మాట, అనంతపురం నుంచి మాట్లాడారు, అనంతపురంలో మీ అనంతపురం ఎమ్మెల్యే ని డయాస్ పైన పెట్టుకొని, మీరు మాట్లాడిన మాటలు ఇవి, ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటామా, తాట తీస్తామని చెప్తున్నారు. ఓ ఆడబిడ్డ గురించి, ఓ మహిళ గురించి, జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తి గురించి, మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటల సంగతి ఏంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడి సంగతి తేల్చాల్సిందే, అసలేం కనికరం చూపించాల్సిన అవసరం లేదు, బట్ మీ పార్టీలో ఉండి ఇటువంటి పిచ్చి కూతలు కూసిన వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ పైన ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి పోలీసులు వెళ్ళాలి, ఎందుకు కాపాడబడుతున్నారు వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు ఎవరు, ఆడబిడ్డ కాదా జూనియర్ ఎన్టీఆర్ తల్లి, ఆడబిడ్డలు కాదా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళలు, ఏం భాష మాట్లాడారు మీ ఎమ్మెల్యే, ఎటువంటి భాష మాట్లాడారు, కేసు పెట్టారా, నిజమో కాదో అడిగారా, చర్య తీసుకున్నారా, కన్వీనియంట్ గా ఉంటుందా న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళనో వేధించడానికి, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కోసం సోషల్ మీడియా పేరుతో కేసులు పెడతారా, మీ పార్టీ వాళ్ళయితే మహిళల్ని ఏమైనా అనొచ్చా, ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళైనా వ్యాఖ్యలు చేయొచ్చా, చేయొచ్చు మా పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు ఎవరిని ఏవైనా తిట్టొచ్చు, మేము వాళ్ళ పైన ఏం చర్యలు తీసుకోమని ఈరోజు మీరు ఎండార్స్మెంట్ చేశారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ని డయాస్ పైన కూర్చోబెట్టుకొని, మహిళల గౌరవం గురించి, మహిళల గౌరవానికి భంగం కలిగితే, మీరు ఏ రకంగా యాక్ట్ చేశారు, అనే దాని గురించి మీరు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నవ్వస్తుంది, ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతారు అని, మీ పార్టీ ఎమ్మెల్యే ఓ హీరోని ఉద్దేశించి ఆడు సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానంటే, థియేటర్లు తగలబెట్టేస్తానంటే, వాళ్ళ కుటుంబంలోని మహిళల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఈ వీడియోలో నేను చెప్పలేని భాష మాట్లాడితే, ఆయన పైన మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని అనంతపురం జిల్లాకు సంబంధించిన మహిళలు ఎవరు అడగరు, వాళ్ళక ఏం తెలియదా అనంతపురంలో చాలా పెద్ద గొడవ అయింది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు, వందల సంఖ్యలో పోలీసులని మీరు అక్కడ పెట్టారు, మీకు తెలియదా అనంతపురం జిల్లా అంతా తెలుసు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తెలుసు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ...
