Kesineni Nani : టీడీపీకి రాజీనామా చేస్తున్నా.. ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన
టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటూ టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు పేస్‌బుక్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.

I Will Resign To TDP And MP Post Says Kesineni Nani
టీడీపీ(TDP) సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని(MP Kesineni Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ(MP) పదవితో పాటూ టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు పేస్‌బుక్(Facebook) వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన పోస్టులో.. 'అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గారు తెలుగు దేశం(Telugu Desham) పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన . కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్(Loksabha Speaker) గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమెదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను'అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
తిరువూరు సభ(Tiruvuru Meeting) విషయంలో కేశినేని బ్రదర్స్(Kesineni Brothers) మధ్య మొదలైన వార్ మరింత ముదిరి నాని రాజీనామా వరకూ వచ్చింది. చంద్రబాబు ఆదేశాలతో పలువురు టీడీపీ నేతలు తనను కలిసి తిరువూరు సభకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు వేరొకరికి ఇవ్వబోతున్నట్లు తనకు తెలిపారని.. తనను పార్టీ విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలు తెలిపారన్నారు.
