ఆమె గతంలో చాలా వివాదాల్లో ఇరుక్కుంది. 2 వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ కూడా అయింది. సస్పెండై జైలుకు వెళ్లి వచ్చినా ఆమె తీరు మారలేదు.

ఆమె గతంలో చాలా వివాదాల్లో ఇరుక్కుంది. 2 వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ కూడా అయింది. సస్పెండై జైలుకు వెళ్లి వచ్చినా ఆమె తీరు మారలేదు. ఆమెకు సినిమాల్లో నటించాలన్న పిచ్చి ఇంకా తగ్గలేదు. గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టై రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత(Swarnalatha ) మరో వివాదానికి పాల్పడింది. విశాఖపట్నం మధురవాడ(Madhurawada) సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నకిలీ ఏసీబీ(ACB) ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్‌ కాల్‌ లిస్ట్‌ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం బాపట్ల(Baptla) జిల్లాలో ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సినిమాల్లో నటించాలన్న ఆశతో డబ్బులు పోగేసుకునేందుకు దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు… డ్యాన్సులు కూడా నేర్చుకున్నారు. ఏపీ 31పేరుతో ఓ సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారురు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం స్వర్ణలత బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు

ehatv

ehatv

Next Story