వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC duvvada Srinivas) ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC duvvada Srinivas) ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. దివ్వెల మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దువ్వాడ భార్య వాణి(Vani) గత కొన్ని రోజులుగా మాధురిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కారు ప్రమాదంలో గాయపడిన మాధురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమా?(Accident) ఆత్మహత్యా(Suicide) ప్రయత్నమా? లేక నాటకమా అన్న కోణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆమె జూమ్‌ కాల్‌ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. మూడు రోజులుగా తనపై ట్రోల్ అవుతున్న వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఆత్మహత్య చేసుకోవడానికే ఇంటి నుంచి బయటకు వచ్చానని మాధురి అంటున్నారు. చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story