భారీ వర్షాల(Heavy Rains) కారణంగా కృష్ణానదికి(Krishna river) వరద పోటెత్తడం, అదే సమయంలో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవల ఢీ కొనడం తెలిసిందే!

భారీ వర్షాల(Heavy Rains) కారణంగా కృష్ణానదికి(Krishna river) వరద పోటెత్తడం, అదే సమయంలో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవల ఢీ కొనడం తెలిసిందే! అయితే ఆ బోట్లు ఢీ కొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చేశారు. ఆ బోట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YCP) చెందిన నేతలు, కార్యకర్తలేనని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Chandrababu) నివేదిక కూడా ఇచ్చారు. ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టిన పడవలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అనుచరులవేనని ఆ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. మామూలుగా అయితే మూడు పడవలను కలిపి కట్టరని అధికారులు చెప్పారు. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్‌ తాళ్లతో కట్టేశారని చెప్పారు. తమ బోట్లతో(Boats) పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో బోటు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందని, అవి ఢీ కొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని పోలీసులు చెప్పారు. ఆ విధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని అనుకున్నారని పోలీసులు నివేదికలో తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story