Jagan 2.0: జగన్ పాదయాత్ర@2027

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను అనే ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారు అంటూ వైసీపీ కి సంబంధించిన నేతలు గతంలో చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. అటువంటి స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో కానీ, నేరుగా ఈరోజు ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాను, ఓ ఏడాదిన్నర తర్వాత జనాల్లోకి రాబోతున్నాను అని, ఏడాదిన్నర అంటే సరిగ్గా కూటమి సర్కార్‌కు మూడేళ్ళు నిండుతాయి. మూడేళ్ళు నిండిన తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తాననే ప్రకటన చేశారు. ఏడాదిన్నర పాటు, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను, ఆ తర్వాత ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని ప్రకటన చేశారు. అంటే చివరి రెండేళ్లలో ఏడాదిన్నర పాటు పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికే వెళ్ళాలి అనే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రజల్ని కలవలేదు, అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలని కలవలేదు, అధికారంలో ఉన్న సమయంలో నాయకులకి అందుబాటులో లేరు, ప్రధానంగా ఆయన పార్టీ ఎదుర్కొన్న విమర్శలు ఇవి. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు, ఆయన ఇప్పటికీ కలవట్లేదు, మాట్లాడట్లేదు కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన ఒపీనియన్ తీసుకోవట్లేదు లాంటి మాటలు కూడా మొదట్లో విన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రమంగా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో కలవటం మొదలుపెట్టారు. రకరకాల కార్యక్రమాల పేరుతో, ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. రైతులకు సంబంధించిన అనేక అంశాలపైన ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన తాడేపల్లిలో ఉన్న సందర్భంలో ప్రతిరోజు వస్తున్న కార్యకర్తల్ని, కంటిన్యూస్ గా కలుస్తూ ఉండటం కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అంతే కాదు అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేకపోయాం, సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం, వాళ్ళని ఆదుకోలేకపోయాం, ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలే ప్రయారిటీగా ఉంటారు, కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే చేస్తూ వస్తున్నారు. 2019-24 వరకు ఉన్న అధికారం వెనక దాదాపు దశాబ్దం పాటు కార్యకర్తల కృషి ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకొని గ్రామాల్లో తామ క్యాడర్ పని చేశారు, వాళ్ళందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాపర్ గా, పార్టీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి, ఎటువంటి లబ్ది జరగలేదు, లబ్ది విషయం పక్కన పెడితే గుర్తింపు కూడా లేదు లాంటి ఒక చర్చ ఆ పార్టీలో ఉంది. దాన్ని అడ్రెస్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. మళ్ళీ పాదయాత్ర పేరుతో ఆయన జనాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకునే నేపధ్యంలో, మళ్ళీ కార్యకర్తలు, మళ్ళీ పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్తి విశ్లేషణ..!


