Jagan Pressmeet: చాలా కాన్ఫిడెంట్‌గా జగన్‌..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. గత కొంత కాలంగా మద్యం అంశానికి సంబంధించి

జగన్‌ను అరెస్ట్ చేయబోతున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నాయి. మద్యం అంశంలో రూ.3 వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం కొట్టేసిందంటూ, జగన్‌ రూ.3 వేల కోట్లు కొట్టేశారంటూ వార్తలు రాస్తూ వచ్చారు. ఈ కథనాలకు అనుగుణంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను కూడా అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ జగనే అంటూ టీడీపీ మీడియా వార్తలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే జగన్‌ ఈరోజు ప్రెస్‌మీట్‌ పెడతారంటూ ప్రకటన వచ్చింది. ఈ ప్రెస్‌మీట్‌లో జగన్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. అసలు మద్యం అంశాన్ని ఆయన చాలా లైట్‌ తీసుకున్నారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో జగన్‌ చెప్పిన విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On 23 May 2025 7:32 AM GMT
ehatv

ehatv

Next Story