Jagan Meeting With YCP Leaders: జగన్ సాహసం ఆయనకు ప్రమాదంగా మారుతుందా..?
ఎమ్మెల్యే(MLA)లతో జరిగిన సమావేశంలో సీఎం జగన్(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏ ఒక్క వైసీపీ(YCP) ఎమ్మెల్యే(MLA)నూ వదులుకునేందుకు నేను సిద్ధంగా లేనని జగన్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల(Early Elections)కు వెళ్లడం లేదని, రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అయన తెలిపారు. 60 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ(YCP) డీలా పడిందని ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని అలంటి వారికి ఎమ్మెల్యేలు బలంగా తిప్పికొట్టాలని పిలుపిచ్చారు.

Jagan Meeting With YCP Leaders:

అయితే జగన్(Jagan) ఏ ఒక్కరిని వదులుకోను అన్న మాటలపైనే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతుంది.. ఎమ్మెల్యేలందరికి జగన్ టిక్కెట్లు ఇస్తారా.. ఒకవేళ ఆలా ఇవ్వకపోతే వారికి ఏ విధంగా సర్దుబాటు చేస్తారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే జగన్ పలు సమావేశాల్లో పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.. ఐతే ఎవ్వరిని వొదులుకోనన్న జగన్ ఎంతమందికి టికెట్లు ఇస్తారు అనేదానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.