వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో(Tirumala) శారదా పీఠానికి(sharada Pitam) తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కొంత స్థలాన్ని కేటాయించింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో(Tirumala) శారదా పీఠానికి(sharada Pitam) తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కొంత స్థలాన్ని కేటాయించింది. అయితే ఆ స్థలానికి మరికొంత స్థలాన్ని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారని ప్రస్తుత టీడీపీ(TDP) పాలక మండలి గుర్తించింది. ఆ భవాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిర్ణయించింది. కబ్జా చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కూల్చేయాల్సిందే! ఎవరూ కాదనరు. మరి గుంటూరు జిల్లా నంబూరులో నిర్మించిన కల్వరి టెంపుల్‌(Kalwari temple) మాటేమిటి? తిరుపతి జిల్లా వరదాయపాలెంలో(Varadayapalem) నిర్మించిన శ్రీ కల్కి అమ్మ భగవాన్‌ టెంపుల్‌(Sri kalki bhagawan Temple) మాటేమిటి? అని ప్రశ్నిస్తున్నారు జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ(Jai Bheemrao Party) అధినేత జడ శ్రవణ్‌కుమార్‌(Jada sravan). కల్వరి టెంపుల్‌కు ఎలాంటి ప్రభుత్వఅనుమతులు లేవని జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరస సురేశ్‌ కుమార్‌(parasa suresh kumar) అంటున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో(AP high court) వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయలతో కట్టడాలు నిర్మించారని పిటిషన్‌లో పేర్కొన్నారు సురేశ్‌కుమార్‌. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది, జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధినేత జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించటం చట్టవిరుద్ధం అని జడ శ్రవణ్‌కుమార్‌ అంటున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలని వాదించారు. పిటిషనర్‌ న్యాయవాది వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కల్వరి టెంపుల్‌ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు తిరుపతి జిల్లాలో నిర్మించిన శ్రీ కల్కి అమ్మ భగవాన్‌ టెంపుల్‌ను కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీటిని కూడా స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని సూచిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story