జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా?

''జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా? జనసేన పార్టీని కూటమిగా మార్చిన తర్వాత, కూటమి పార్టీలో కలిసిన తర్వాత, ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తే, మేమంతా తెలుగుదేశాన్ని విమర్శించాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయనపై లెవెల్లో గెలిచారు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరు రివ్యూ చేయట్లే. పార్టీ ఆఫీస్ లో జనసైనికులకు ఎంట్రన్స్ లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన అధినాయకుడు సమస్యలపై స్పందించడు. వినోద కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు, ఆవిడ రాజకీయ జీవితం దెబ్బ తగిలినా స్పందించరు, ఆవిడ బెడ్రూమ్ లో సిసీ కెమెరా పెడితే అది పర్సనల్ అంటారు, కొట్టే కావ్య స్పందించరు, ఆకుల వనజ స్పందించరు, అయ్యప్ప కోటిపల్లి స్పందించరు.

ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవినేని ఉమా ఆ వీడియో రిలీజ్ చేసి, జనసేన ఎమ్మెల్యే ని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డామేజ్ అండి దాని గురించి కూడా ఎవరు స్పందించరు. మేమంతా రూపాయి కూడా ఆశించలేదు. పార్టీలో గుర్తింపు కోరుకోలేదు. పదవులు కోరుకోలేదు, మేము ఎందుకు పని చేసామండి, మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే, మేము సోషల్ మీడియాలో పోరాడాం. ఎందుకు పోరాడం, సమాజానికి మంచి జరుగుద్దని అంతేగాని చంద్రబాబు నాయుడు కుటుంబానికి మంచి జరుగుద్దని కాదు, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకోసం, మిమ్మల్ని నమ్మి, మీరు చేసిన రిక్వెస్ట్‌ను మన్నించి, పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కులభావంతో మీకు ఓటు వేయమన్నారు. మేము వేసాం, ఏం చేసారు, ఈరోజు మీరు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు, చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ నాయుడుకి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నారు, మీ వైఖరి వల్ల జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు, జనసేనకు పనిచేసిన మాలాంటి జనసైనికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఫీల్ అవుతున్నాం, మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము లెటర్లు ఇచ్చేస్తాం, సస్పెండ్‌ చేసేస్తాం అంటే ఎవరూ భయపడరు ఇక్కడ, పార్టీ మీ పార్టీ అనేది మీ వైఖరి మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది.

మాకు పోరాటం కొత్త ఏం కాదు, అర్థమైందా, మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే అవసరం లేదు. మాకు మేము ఈ సమాజానికి మంచి జరుగుద్ది మీ ద్వారా అని నమ్మి, మేము మీతో పయనించాం కానీ, ఇక్కడ మీరు దేనికి స్పందించకపోవడం, దేని గురించి పట్టించుకోపోవడం, అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మర్డర్ చేస్తున్నట్టు ఉంది. ఇది జనసేన పార్టీని ఒక ప్లాన్ ప్రకారం, జనసేన పార్టీని తగ్గిస్తున్నారు. రేపు ఫ్యూచర్ లో మీరు ఒక 50 సీట్లో, 100 సీట్లో అడుగుతారేమో, మళ్ళీ ఇవ్వాలేమో అని తెలుగుదేశం పార్టీ, మన జనసేన పార్టీని తగ్గిస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. జనసైనికులు అందరూ కూడా, జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే, ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది. నిన్న గాక మనం కందుకూరులో సంఘటన చూశాం. ఇప్పుడు మంగళగిరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ స్టేట్ లో ఏం జరుగుతుంది, దేన్ని ఆయన స్పందించరు కనీసం బాధ్యతలను పిలిపించి మాట్లాడాలి కదా, డిప్యూటీ సీఎం బాధ్యత పిలిపించి మాట్లాడాలి కదా, మీకు హోదా ఉంది, మీరు పవర్ లో ఉన్నాం. మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, వాట్ ఇస్ ద యూస్ అండి, వాట్ ఫర్ యువర్ అండి, మేమంతా అడుగుతున్నాం, లేదు సార్ ఇట్స్ వెరీ వెరీ వెరీ క్రిటికల్ కండిషన్ లో ఉంది. జనసేన పరిస్థితి ఇది, ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు, మీ వెనక ఉన్న వాళ్ళు, స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరిమేసేందుకు ఒక టీమ్ ని పెట్టినట్టు ఉందండి మీ వైఖరి. తెలుసుకోకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇది మేము చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఎందుకంటే పార్టీ వల్ల మాకు వచ్చే లాభం ఏమీ లేదు, ఉద్యోగాలు మాకు ఉన్నాయి, మా జీతాలు మాకు ఉన్నాయి, ఉద్యోగాలు రిస్క్ చేసి మేము పార్టీ కోసం పని చేసాం కాబట్టి, ఈ రోజు అడగడానికి సరిపోతున్నాం, మేము 10 ఏళ్ళు సమయాన్ని వేస్ట్ చేశాం. రెండు ఎలక్షన్లకు మీకు మేము ఆర్థిక సహాయం చేసాం. పార్టీ మాకు ఏం చేద్దాం అనేది మాకు అనవసరం, మీరు సమాజానికి ఏదైనా చేయండి. మాకేం చేయక్కర్లేదు ఇది జనసైనికుడిగా మా ఆవేదన తెలియజేస్తున్నాం'' అని ఓ జనసేన నాయకుడు సెల్ఫీ వీడియో తీసి మీడియాకు పంపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలైంది.

Updated On
ehatv

ehatv

Next Story