Pawan Kalyan : సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన జనసేనాని
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్(Srikalahasti CI Anju Yadav)పై తిరుపతి జిల్లా(Tirupati District) ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి(sp parameswar reddy)కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport) నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు.

Pawan Kalyan
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్(Srikalahasti CI Anju Yadav)పై తిరుపతి జిల్లా(Tirupati District) ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి(sp parameswar reddy)కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport) నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు.
ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సహా జనసైన శ్రేణులు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలోనే పవన్ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.
