Pawan - Anna Lezhneva : ఒక్క ఫోటో.. విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టిన పవన్ దంపతులు
జనసేనాని పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి జనసేన పరోక్షంగా చెక్ చెప్పే ప్రయత్నాలు చేసింది. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తైనందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు

Janasena upload Pawan Kalyan and Ana puja photo in Social Media
జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan), అన్నా లెజినోవా(Anna Lezhneva) దంపతులు విడిపోతున్నారంటూ సోషల్ మీడియా(Social Media)లో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి జనసేన(Janasena) పరోక్షంగా చెక్ చెప్పే ప్రయత్నాలు చేసింది. వారాహి(Vaarahi) మొదటి విడత విజయవంతంగా పూర్తైనందున పవన్ దంపతులు(Pawan Couple) తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను జనసేన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.. తద్వారా విడిపోతున్నారనే వార్తలు అసత్య ప్రచారంగా తేల్చినట్లైంది.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2023
'జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొన్ని రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు.' అని పోస్ట్ ద్వారా తెలియజేశారు.
