భారీ వర్షాల(Heavy rains) కారణంగా దెబ్బ తిన్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ తన వంతు సాయం చేశారు.

భారీ వర్షాల(Heavy rains) కారణంగా దెబ్బ తిన్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ తన వంతు సాయం చేశారు. విపత్తును చూసి చలించిపోయిన తారక్‌(NTTR) ఉభయ రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయలను విరాళంగా(Donation) ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలిపారు. 'రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను' అని తారక్‌ రాసుకొచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story