ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల కౌశిక్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల కౌశిక్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడికి జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) అంటే పిచ్చి ప్రేమ! ప్రాణం కూడా! చావుబతుకుల మధ్య పోరాడుతున్న కౌశిక్‌ (Koushik)తనను దేవర సినిమా చూసే వరకు బతికించండి అని అభ్యర్థిస్తున్నాడు. సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు తనలో ఊపిరి ఉండేట్టు చూడండి అంటూ వైద్యలను వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా కౌశిక్‌ తల్లి మీడియాతో మాట్లాడారు. తన కొడుకును బతికించండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan),జూనియర్‌ ఎన్టీఆర్‌లను వేడుకున్నారు. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడు బెంగ‌ళూరులోని కిడ్‌వై (kidwai)ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. త‌మ బిడ్డ చివ‌రి కోరిక తీర్చాలని, చంద్రబాబు, పవన్, జూ.ఎన్టీఆర్ స్పందించాలని కౌశిక్‌ తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story