రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే భేటీ అవ‌నున్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే భేటీ అవ‌నున్నారు. శుక్రవారం ఉద‌యం విజయవాడలో ఇద్ద‌రు మంత్రులు సమావేశం అవుతారు. రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ స‌మావేశంలో పాల్గొంటారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకొని ఎంఓయూ కుదుర్చుకుంటారని ఉప ముఖ్యమంత్రి కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. మధ్యాహ్నం 12 గం. 30 ని.లకు విజయవాడ లెమెన్ ట్రీ హోటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story