Public Interest Litigation Cases : ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై(Bolla Brahmanaidu) భూ కబ్జా ఆరోపణలు వైసీపీలో(YCP) కలకలం రేపుతున్నాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి(Brahmananapally) గ్రామంలో 175 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి..

Public Interest
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై(Bolla Brahmanaidu) భూ కబ్జా ఆరోపణలు వైసీపీలో(YCP) కలకలం రేపుతున్నాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి(Brahmananapally) గ్రామంలో 175 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. దానిపై రూ.50 కోట్ల బ్యాంకు రుణం పొందడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాల్పూరి ఆగ్రోటెక్(Agrotech), శ్రీవత్సవ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీల ద్వారా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ మార్గాన విక్రయ పత్రాలు సృష్టించి తద్వారా బ్యాంకు రుణం పొందారని వినుకొండకు చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్(Sravan Kummar) పిటీషనర్ తరపున వాదనలు వినిపించారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి.. బ్యాంకు నుంచి రుణం పొందారని న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. జస్టిస్ ఆకుల శేష సాయి, జస్టిస్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం పిటీషన్‌పై విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


