ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ వివేకా(YS Viveka) కూతురు సునీత దంపతులు కలిశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ వివేకా(YS Viveka) కూతురు సునీత దంపతులు కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి(Krishna Reddy)ఫిర్యాదుపై నిజానిజాలు తేల్చాలని, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌(CBI SP Ram Singh)తో పాటు తనపై అక్రమంగా కేసు పెట్టారని చంద్రబాబు(CM Chandra Babu)కు తెలిపిన సునీత. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. సీబీసీఐడీ(CBCID)విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని కోరిన వైఎస్ సునీత(YS Sunitha). తనకు కేసు గురించి అన్ని విషయాలు తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని చంద్రబాబు సునీత దంపతులకు హామీ ఇచ్చారు. దీంతో వివేకా హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విచారణతోనైనా వివేకా వెనుక అసలు నిందితులు ఎవరున్నారో తెలుతుందో లేదో వేచిచూడాలి.

Updated On
ehatv

ehatv

Next Story