✕
Andhra pradesh : ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. మహిళ మృతి...
By ehatvPublished on 12 Nov 2025 5:37 AM GMT
అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా కిడ్నీ రాకెట్ జరిగింది.

x
అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా కిడ్నీ రాకెట్ జరిగింది. యమున అనే ఓ మహిళను వైజాగ్ నుండి తిరుపతి మీదుగా మదనపల్లి తీసుకొచ్చిన బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయ్యింది. మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. యమున భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ ను ట్రాక్ చేసిన పోలీసులు. గ్లోబల్ హాస్పిటల్‌లో యమున కిడ్నీలను తొలగించిన డాక్టర్లు. తీవ్ర అనారోగ్యంతో యమున మృతి. మృతి చెందిన యమున మృతదేహాన్ని కూడా చూపకపోవడంతో డయల్ 112 కు ఫిర్యాదు చేసిన భర్త. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

ehatv
Next Story

