ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawankalyan), తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi stalin) మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawankalyan), తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi stalin) మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది. సనాతనం ధర్మం(Sanathan dharma) ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చిచ్చులేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూలాంటిదని బీజేపీని టార్గెట్‌ చేస్తూ ప్రసంగాలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ప్రధాని మోడీ(PM Modi) కూడా దీనిపై స్పందించి ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. లడ్డూ(Laddu) వివాదం సందర్భంగా దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌ దాన్ని విరమిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యానిస్తూ సనాతన ధర్మాన్ని కొందరు మలేరియా, డెంగ్యూ లాంటిదని అనడాన్ని తప్పుపట్టారు. అలాంటివారి వల్ల ఏదీ కాదని పరోక్షంగా తమిళనాడు డిప్యూటీ సీఎంను ఉద్దేశించి మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని.. సనాతన ధర్మం కోసం ఎక్కడివరకైనా పోరాటం ఆగదని తెలిపారు. అయితే పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై తమిళనాడులో స్టాలిన్‌ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పవన్‌కు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్నారు. ఈ విషయంపై ఉదయనిధి స్పందిస్తూ.. 'వెయింట్ అండ్‌ సీ' అని నవ్వుతూ వెళ్లిపోయారు. అయితే పవన్ కల్యాణ్‌పై మదురై పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. ఓ లాయర్‌ పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు రెచ్చగొట్టే ధోరణితో పవన్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ అంశంపై పవన్‌ స్పందన ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది

Updated On
Eha Tv

Eha Tv

Next Story