Delhi : నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల నేతలు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Leaders of Telugu states are visiting Delhi today
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో వారు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌కు హాజరుకానున్నారు. సమావేశంలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై చర్చించే అవకాశం ఉంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, రాజ్‌కుమార్ సింగ్‌లతో భట్టి భేటీకానున్నారు. అలాగే పర్యావరణం, అటవీశాఖ కార్యదర్శులను భట్టి విక్రమార్క కలవనున్నారు.
జనసేన అధినేత పవన్, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు కూడా నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో BJPతో పొత్తుపై చర్చ జరపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వీరు భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత పొత్తుతో పాటు సీట్ల పంపకంపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది.
