లోకేష్‌కు డిప్యూటీ సీఎం అవసరం లేదు: గోరంట్ల కీలక వ్యాఖ్యలు

నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలన్న టీడీపీ నేతలు, కార్యకర్తల డిమాండ్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి. దావోస్‌లో జరిగిన సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌ను ఆ పార్టీ ఎంపీ టీజీ భరత్ భూజానికెత్తుకున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నారా లోకేష్‌ భవిష్యత్‌ ముఖ్యమంత్రి అంటూ కుండబద్ధలు కొట్టారు. అచ్చెంన్నాయుడు కూడా ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేషే చంద్రబాబు వారసడన్నారు. అయితే బుచ్చయ్య చౌదరి మాత్రం టీడీపీ నేతలు ఆ పదవి ఇవ్వాలనడం సరికాదన్నారు. పవన్‌ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం లోకేశ్ కష్టపడి పని చేశారని, అందుకు ఆయనకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇటీవల పలు సందర్భాల్లో ఆ పార్టీ నేతలు కొందరు కోరగా టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Updated On
ehatv

ehatv

Next Story