ప్రియురాలు సేఫ్‌.. ప్రియుడు సీరియస్‌

శ్రీవారి మెట్టు మార్గంలో(Alipiri metlu) ప్రేమికులు(Lovers) ఆత్మహత్యకు(Suicide) ప్రయత్నించారు. దాంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల కిందట చెప్పాపెట్టకుండా ఇద్దరు ఇంటినుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారి మెట్టు నడక మార్గంలో తిరుమలకు బయలుదేరారు. 450 వ మెట్టు దగ్గరకు వచ్చాక ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. పురుగుల మందు తాగిన తర్వాత ఆ మహిళ భర్తకు ఫోన్‌ చేసి విషం తాగిన విషయం చెప్పింది. దాంతో భర్త హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ప్రేమికులను రుయా ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రేమికులను చిత్తూరు టౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీష్, రాధికలుగా గుర్తించారు పోలీసులు… భార్యను, ఆమె ప్రియుడిని భర్తే ఆసుపత్రిలో చేర్పించడం గమనార్హం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story