Guntur Medical College : ఆస్పత్రిలో డాక్టర్ల నగ్నవీడియోల చిత్రీకరణ..!
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు డ్రెస్ చేంజ్ చేసుకునే సమయంలో నగ్న వీడియోలు తీస్తున్న మేల్ నర్స్‌ను ప్రత్తిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు డ్రెస్ చేంజ్ చేసుకునే సమయంలో నగ్న వీడియోలు తీస్తున్న మేల్ నర్స్‌ను ప్రత్తిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో నెల రోజుల కిందట చిలకలూరిపేట సమీపంలోని పురుషోత్తమపట్నంకు చెందిన రాచపూడి వెంకటసాయి మేల్ నర్సుగా విధుల్లో చేరాడు. ఈ క్రమంలో ఆపరేషన్ థియేటర్ దగ్గరలో ఉండే డ్రెస్సింగ్ రూమ్‌లో మహిళా డాక్టర్లు, పీజీ విద్యార్థులు దుస్తులు మార్చుకునే సమయంలో వెంకటసాయి తన మొబైల్ ద్వారా గోడపై నుంచి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. వైద్యులు, విద్యార్థులు విషయాన్ని గమనించి ఫోన్ లాక్కుని అందులో ఉన్న వీడియోలను డిలీట్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటసాయిని అదుపులోనికి తీసుకుని, అతని మొబైల్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అందులో ఉన్న డిలీటెడ్ డేటా రికవరీ చేసిన వెంటనే ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని తెలిపారు.


