Minister Gudivada Amarnath : లోకేష్ కోసం మట్టి కుండలో పప్పు రెడీ చేశా
తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. 'పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ.. ఆనాడు మంత్రిగా లోకేశ్ ఏం చేశారో చెప్పగలరా? అని సవాల్ విసిరారు.
![Minister Gudivada Amarnath Return Gift to Nara Lokesh Minister Gudivada Amarnath Return Gift to Nara Lokesh](https://ehatvsite.hocalwire.in/wp-content/uploads/2024/02/Minister-Gudivada-Amarnath-Return-Gift-to-Nara-Lokesh.jpg)
Minister Gudivada Amarnath Return Gift to Nara Lokesh
తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. 'పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ.. ఆనాడు మంత్రిగా లోకేశ్ ఏం చేశారో చెప్పగలరా? అని సవాల్ విసిరారు. నేను గంజాయి డాన్ అని ఆరోపిస్తున్నారు.. అయ్యన్నపాత్రుడు గంజాయి డాన్ అని మీ పార్టీలో ఉన్న గంటా చెప్పలేదా? అని నిలదీశారు. లోకేష్ కి ఇష్టమైన పప్పుని కుండలో పెట్టి సిద్ధం చేశాను.. సాహసం చేసి ఎవరైనా తీసుకెళ్లండి' అంటూ ఎబీఎన్, టీవీ5, ఈటీవీ రిపోర్టలకు చెబుతూ అమర్నాథ్ సెటైర్లు వేశారు. లేదంటే లోకేశ్ కు ఇష్టమైన ఐటెం కాబట్టి ఆయననే పరుగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్లాలని వ్యంగాస్త్రాలు సంధించారు.
టీడీపీ అధికారంలోకి రావడానికి అనేకసార్లు సహకరించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏనాడు న్యాయం చేయని తండ్రీకొడుకులు తాజాగా ఈ ప్రాంతంపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు. ఏమాత్రం సిగ్గు, లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేశ్ అని అన్నారు. వాళ్లలో కొంత రేషాన్ని పెంచడానికి ఉప్పు, కారం కలుపుకొచ్చానని అన్నారు.
![Yagnik Yagnik](/images/authorplaceholder.jpg)