నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu) అంటే ఆ పత్రికాధిపతికి(News Paper) అలవిమాలిన అభిమానం.

నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu) అంటే ఆ పత్రికాధిపతికి(News Paper) అలవిమాలిన అభిమానం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తనే అయినంతగా సంబరపడతారాయన! ఆయనను గద్దెనెక్కించడానికి చేయాల్సిన పనులన్నీ నిసిగ్గుగా చేస్తారు. అధికారపక్షంపై పనికిమాలిన విమర్శలన్నీ చేస్తారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుతూ ఉంటారు. స్వకులం కావడం వల్ల చంద్రబాబును అద్భుతమైన మేధస్సు కలిగిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పంట బాగా పండేది. ప్రస్తుతం చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ, మునుపటిలా ఈయనగారి హవా నడవడం లేదని వినికిడి. సాధారణంగా ఆయన తన పత్రిక ద్వారా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుందని, ఫలానా మంత్రి సరిగ్గా పని చేయడం లేదని, ఫలానా అధికారికి అందలం ఎక్కించాలని, ఫలానా వారిని ట్రాన్స్‌ఫర్‌ చేయాలని, ఫలానా వ్యక్తికి కాంట్రాక్ట్‌ ఇవ్వాలని ఆ మీడియా అధిపతి సలహాలు ఇస్తున్నట్టుగా తన స్వకార్యాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడాయన పప్పులేమీ ఉడకటం లేదట! ప్రభుత్వలో ఆయన జోక్యాన్ని నారా లోకేశ్‌ సహించలేకపోతున్నారట. 'అంకుల్‌ ఇక మీరు గమ్మున ఉంటే బాగుంటుంది. నేను,నాన్న చూసుకుంటాం. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాం. మీరు ఆవేదన చెందనవసరం లేదు' అని ఆ పత్రికాధిపతికి నిర్మోహమాటంగా చెప్పేశారట! చంద్రబాబు తన జేబులో మనిషని అనుకుంటున్న ఆ మీడియా అధిపతికి లోకేశ్‌ మాటలు బాధించాయట! ఇక తన పలుకుబడి చెల్లదని తెలుసుకున్నారట! ప్రస్తుతం పైలెంట్‌గా ఉండటమే బెటరనే భావనకు వచ్చారట!

Updated On
Eha Tv

Eha Tv

Next Story