ఆంధ్రజ్యోతి(Andhra jyoti) గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు(Radha Krishna) ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) శుభాకాంక్షలు

ఆంధ్రజ్యోతి(Andhra jyoti) గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు(Radha Krishna) ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) శుభాకాంక్షలు, దాంతో పాటు అభినందనలు తెలిపారు. ఏబీఎన్‌ ఛానెల్‌ 15వ వార్షికోత్సవం సందర్భంగా లోకేశ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టులు, సిబ్బందికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో అభినందన సందేశం పంపారు. 'ఏబీఎన్ ఛానల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారికి, జర్నలిస్టులు, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. we report you decide నినాదంతో ఏబీఎన్ దమ్మున్న చానల్‌గా నిరూపించుకుంది. సంచలన కథనాలు ప్రసారం చేసే రాజీలేని జర్నలిజం ఏబీఎన్ నైజం. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా ప్రజాపక్షమై తెలుగువాణి వినిపిస్తోంది ఏబీఎన్ ఛానల్' అని లోకేశ్‌ రాసుకొచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story