ఉమ్మడి చిత్తూరు(Chittoor ) జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నానిపై(Pulivarthi Nani) అవినీతి(Corruption) ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఉమ్మడి చిత్తూరు(Chittoor ) జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నానిపై(Pulivarthi Nani) అవినీతి(Corruption) ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పులివర్తి నానితో పాటు ఆయన భార్య సుధారెడ్డి(Sudha reddy), కుమారుడు కూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారంటూ తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల పత్రికలోనే అచ్చయ్యింది. తమ్మళ్లూ ఇది తగదు అంటూ బ్యానర్‌ స్టోరీ ప్రచురితమైంది. పేరు ప్రస్తావించకుండా అందరికీ అర్థమయ్యేలా కథనాన్ని రాసుకొచ్చింది. చంద్రగిరిలో కుటుంబపాలన సాగుతోందని, ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య, కొడుకు దందాలు చేస్తున్నారని తెలిపింది. ఈ కథనం వచ్చి వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఫ్యామిలీ రియాక్టవ్వలేదు. అయితే ఎమ్మెల్యేకు మాత్రం భయం పట్టుకుంది. తనను కాపాడాలంటూ మంత్రి నారా లోకేశ్‌ను శరణుజొచ్చారని వినికిడి. ఎన్నికల ముందు వరకు చంద్రబాబునాయుడు, లోకేశ్‌లిద్దరూ పులివర్తి నానిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఫ్యామిలీ చేస్తున్న అరాచకాలను చూసి తండ్రికొడుకులిద్దరూ ఆశ్చర్యపోయారు. దోచుకోవడం మానేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యేను హెచ్చరించారు. దాంతో ఎమ్మెల్యేకు కంగారుపుట్టింది. బెదిరిపోయారు. ఆగమేఘాల మీద నారా లోకేశ్‌ను కలుసుకుని చేసిన తప్పులకు మన్నింపు కోరారని తెలిసింది. అటు పిమ్మట చంద్రబాబును కూడా కలుసుకున్నారట! ఇక నుంచి ఎలాంటి అక్రమాలు చేయనని, ఎలాంటి అవినీతికి పాల్పడనని చంద్రబాబుకు మాట ఇచ్చారట!

Updated On
Eha Tv

Eha Tv

Next Story