రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు

రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ తనం తో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పయ్యావుల కేశవ్ శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా శాసన సభ కార్యదర్శి పిపికే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె. రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏవో కె. పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియ జేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story