తాగేతే తాగారు కానీ గొడవలు గట్రాలు చేయకుండా గమ్మునుండాలి.

తాగేతే తాగారు కానీ గొడవలు గట్రాలు చేయకుండా గమ్మునుండాలి. తాగితే తమంతటి తోపులు ఉండరనుకుంటారు. ఎక్కడాలేని ధైర్యం వచ్చేస్తుంది. ఆ దమ్ముతోనే మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ(Konaseema) జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో ఈ ఘటన జరిగింది. మంత్రి వాసంశెట్టి సుభాష్‌(Vasam Shetty subash) కాన్వాయ్‌నే ఆపేశారు. గంజాయి మత్తులో(Weed toxication) వారికి ఏం చేస్తున్నామో కూడా తెలియలేదు. మేం కాపులం. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రిని నానా మాటలనేశారు. పోలీసులు గమ్మునుండరు కదా! ఆ ఆరుగురుని అదుపులోకి తీసుకుని ఫోటోలో చూపించినట్టుగా స్టేషన్‌లో నిలబెట్టారు. వీరందరూ రాజమండ్రికి చెందిన వారని తేలింది. చిత్రమేమిటంటే మందు తాగకుండా మట్లపాలెం వెళ్లి కడియాలు వేసుకున్నారు. యానాంకు వెళ్లి ఆ కడియాలు తీసేసి పీకల్దాక మందుతాగారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story