Minister Chelluboyina Srinivasa Venugopalakrishna : పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. పవన్ పూటకో వేషం వేస్తున్నారని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

Minister Venugopala Krishna criticizes Janasena chief Pawan Kalyan
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ(Chelluboyina Srinivasa Venugopalakrishna) మండిపడ్డారు. పవన్ పూటకో వేషం వేస్తున్నారని, చంద్రబాబు(Chandrababu) ఇచ్చిన స్క్రిప్ట్(Script) చదువుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి అని విమర్శించారు.
ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటారని, తర్వాత ఇస్తే తీసుకుంటానంటారని మంత్రి ఎద్దేవా చేశారు. కుల(Caste) ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. చిరంజీవి(Chiranjeevi) కష్టపడి సంపాదించిన ఇమేజ్(Image) ఆయనకు లభించిందని అన్నారు. నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు. తప్పులు ఉంటే చెప్పాలి. కానీ చెప్పులు చూపించడం సరి కాదన్నారు.
