MLA Kodali Nani : రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోడాలి నాని
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కోడాలి నాని పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే నాని.. రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

MLA Kodali Nani participated in Ram Charan’s birthday celebrations
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కోడాలి నాని పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే నాని.. రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ పురస్కారం పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి.. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. పెద్దలు, అనుభవజ్ఞులు పట్ల గౌరవ మర్యాదలతో ఉంటూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి రామ్ చరణ్ అని కొనియాడారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా
నడుచుకునే విధానమే.. రామ్ చరణ్ కు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ముందుకు వెళుతున్న రామ్ చరణ్.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకొని జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాని అన్నారు.
