MLA Rakshana Nidhi : వైసీపీకి ఆ ఎమ్మెల్యే కూడా షాకివ్వనున్నారా..?
వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

MLA Raksha Nidhi plans to resign from YCP
వైసీపీ(YSRCP)కి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే(MMLA) పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా కృష్ణా(Krishna) జిల్లాకు చెందిన తిరువూరు(Tiruvuru) ఎమ్మెల్యే రక్షణ నిధి(MLA Rakshana Nidhi) పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి(Ayodhya Ramireddy), మర్రి రాజశేఖర్(Marri Rajashekar).. రక్షణ నిధితో జరిపిన చర్చలు విఫలం అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఏ విషయమైనది స్పష్టత రావాల్సివుంది.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికలకు టికెట్ ఆశించి భంగపడ్డ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. పలువురు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు జనసేన, ఇంకొందరు షర్మిల వెంట నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
