“వంగ వీటి రాధా బతికుంటే.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు!”- అని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

“వంగ వీటి రాధా బతికుంటే.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు!”- అని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవారు ఉంటే.. చిరంజీవి(Chiranjeevi), పవన్ కల్యాణ్‌లు అసలు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదని.. వారు తమ సినిమాలు చేసుకునేవారని చెప్పారు. అలా సేవ చేసే వారు లేనందునే వారు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రంగాపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించినప్పుడు.. ఆయన గొప్ప నాయకుడని నాగబాబు(nagababu) చెప్పుకొచ్చారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు కాబట్టే.. ఆయన చనిపోయిన ఇన్నేళ్లయినా ప్రజలు రంగాను గుర్తు చేసుకుంటున్నారన్నారు. నిజానికి ఆయన జీవించి ఉంటే.. మేం రాజకీయాల్లోకి వచ్చేవాళ్లం కాదని చెప్పుకొచ్చారు.వంగవీటి రంగా జీవించి ఉంటే.. మేం రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఏముంటుందన్నారు. ఓ గొప్ప వ్యక్తి, పదిమందికి సాయం చేసే గొప్ప నాయకుడు ఉండుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రోడ్డు ఎక్కేవారు కాదు.” అని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సొంత పార్టీలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదన్నారు. తాము హాయిగా సినిమాలు చేసుకునే వాళ్లమని ఆయన చెప్పారు. రంగా జీవించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యేవారని తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story