Nara Bhuvaneshwari : చంపేస్తామని కుటుంబాన్ని బెదిరించారు: భువనేశ్వరి..!
ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ దూరదృష్టి అని భువనేశ్వరి అన్నారు.

ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ దూరదృష్టి అని భువనేశ్వరి అన్నారు. భాషా, సంస్కృతి ఐక్యతకు ప్రతీక ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం అని భువనేశ్వరి అన్నారు. పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని చంద్రబాబు నిలబెడుతున్నారు. CII సదస్సు సూపర్ సక్సెస్ అవ్వడంతో మూడు రోజుల్లోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సమాజాభివృద్ధి కోసం యువత ముందుకు రావాలి అన నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. మన భారతదేశ భవిష్యత్తు నాయకులను ఉద్దేశించి ప్రసంగించడానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది మీరే, ఏ పార్టీ అయినా, ఏ మతం అయినా, మన దేశాన్ని రక్షించి, గర్వపడేలా చేసేది మీరే. చుట్టూ జరుగుతున్నది మనం చూస్తున్నందున, మనమందరం కలిసి నిలబడి మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇది మన పని కాదని మనం భావించకూడదు. భారత పౌరులుగా మన పని మనం దానిని రక్షించుకోవాలి. మరోసారి నేను, మీరు చేతులు కలిపి దేశాన్ని రక్షించుకోవాలని అభ్యర్థిస్తున్నా. భారతదేశం. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. యువకులు చాలా ఆలోచించాలి. మా కుటుంబానికి మీరిచ్చిన తోడ్పాటుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు ప్రజలు ఇచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోదన్నారు. చంద్రబాబును, తమ కుటుంబానికి ఎవరెన్ని బెదిరింపులు చేసినా కానీ మేం భయపడమన్నారు. తమ కుటుంబానికి ఎన్నో రకాల బెదిరింపులు వస్తున్నాయి. అయినా భయపేడదిలేదని, రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్నారు


