కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు జమచేస్తామని స్పష్టం చేస్తామని వెల్లడించింది.సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి చేస్తామని, అందుకు తగినట్లు కేటాయింపులు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు నిధులు కేటాయిస్తామని తెలిపింది. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరులో కారిడార్ల నిర్మాణాం చేపడతామని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారిస్తామని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ఏపీలో పారిశ్రామిక విప్లవానికి తోడ్పాడునిస్తామని నిర్మలాసీతారామన్ ప్రకటించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story