Psycho Killer Ankamma Rao : ఈ నెలలోనే మూడు హత్యలు చేశాడు : పల్నాడు ఎస్పీ
వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్ అంకమరావును అరెస్టు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. 2003 నుండే అంకమరావు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అరెస్టు అవుతూ వచ్చాడని పేర్కొన్నారు. 2022లో మాత్రం వృద్దురాలిని హత్య చేశాడని.. ఆ హత్య కేసులో అంకమరావును అరెస్టు చేశామని.. సరైన ఆధారాలు లేకపోవటంతో కేసు కొట్టేశారని వెల్లడించారు.

Palnadu District SP Ravi Shankar Reddy On Psycho Killer Ankamma Rao Arrest
వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్(Psycho Killer) అంకమరావు(Ankamma Rao)ను అరెస్టు(Arrest) చేశామని పల్నాడు జిల్లా(Palnadu Distrct) ఎస్పీ రవిశంకర్ రెడ్డి(SP Ravi Shankar Reddy )తెలిపారు. 2003 నుండే అంకమరావు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అరెస్టు అవుతూ వచ్చాడని పేర్కొన్నారు. 2022లో మాత్రం వృద్దురాలిని హత్య చేశాడని.. ఆ హత్య కేసులో అంకమరావును అరెస్టు చేశామని.. సరైన ఆధారాలు లేకపోవటంతో కేసు కొట్టేశారని వెల్లడించారు. ఆ తర్వాత ఈ నెలలో అంకమరావు(Ankamma Ra) మూడు హత్యలు చేశాడని.. సాంకేతికతను ఉపయోగించి అన్ని ఆధారాలు సేకరించి అరెస్టు చేశామని వివరించారు. నర్సరావుపేట వాసులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నైట్ బీట్లు పెంచుతామని.. కమాండ్ అండ్ కంట్రోల్ రూం(Command And Control Room) నుండి మానిటరింగ్ చేస్తామని పేర్కొన్నారు.
