Pawan Kalyan meets Chandrababu Naidu : చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. రాజకీయ వర్గాల్లో చర్చ
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య మైత్రి కొనసాగుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇరువురు నేతలు భేటీ అవ్వడం ఇది మూడవ సారి.

Pawan Kalyan meets Chandrababu Naidu in Hyderabad
ఎన్నికలు(Elections) సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీల మధ్య మైత్రి కొనసాగుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇరువురు నేతలు భేటీ అవ్వడం ఇది మూడవ సారి. ఈ భేటీలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాడే అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో విపక్షాలన్నీ తోడేళ్లల కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి చూస్తున్నాయని సీఎం జగన్ పదే పదే విమర్శిస్తున్నారు. ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేసే దమ్ము లేదని ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వీరు భేటీ అయిన ప్రతిసారి.. ఏం ప్రకటన రానుంది..? పొత్తులపై స్పష్టత వస్తుందా..? అనే కోణంలో ఎదురుచూస్తున్నారు.
