Varahi Yatra In Krishna District : కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర.. గన్నవరం చేరుకున్న పవన్..!
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport) చేరుకున్నారు. అక్కడ జనసేన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి పవన్..

Varahi Yatra In Krishna District
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport) చేరుకున్నారు. అక్కడ జనసేన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి పవన్.. రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయంకు బయలుదేరి వెళ్ళారు. కృష్ణా జిల్లాలో జరగనున్న వారాహి యాత్ర గురించి ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్.
ఇదిలావుంటే.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.
