రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిఠాపురం, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వారాహి సభకు ముందు శ్రీ పాద గయ క్షేత్రానికి వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గా భవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

మొదట విఘ్నేశ్వరుడిని, శ్రీపాద శ్రీవల్లభుడిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తిస్వరూపిణి అయిన పురూహుతికా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజానంతరం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందచేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story