ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ రోజు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని (ఇరిగేషన్ భవనం) క్యాంపు కార్యాలయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియచేసిన పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని త‌న‌ నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న క్రమంలో విజయవాడలో కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్ తో సహా వెనక్కి తీసుకోవలసిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story