వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(Ysr Congress Party) సీనియర్‌ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు (Cm Chandrabau)అంత కోపం ఎందుకు?

Peddi Reddy Ramachadra Reddy: పెద్దిరెడ్డి చేతిలో తన్నులు తిన్న చంద్రబాబు.. అందుకే అంత కోపం!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(Ysr Congress Party) సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachadra Reddy) అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు (Cm Chandrabau)అంత కోపం ఎందుకు? ఎందుకో జగన్మోహన్‌రెడ్డి(Ys Jagan Mohan Reddy) విపులంగా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరిదీ చిత్తూరు(chitoor) జిల్లానే! ఒకప్పడు వీరిద్దరు క్లాస్‌మేట్స్‌ కూడా! ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఫ్రెండ్స్‌ఆనే ఉన్నారు. మరి ఇద్దరి మధ్య ఎందుకు గొడవలొచ్చాయంటే.. కాలేజీలో చదువుకునే రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి బాగా కొట్టారట! అప్పుడు చంద్రబాబుకు తెగ కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయారట! ఆ కోపం ఆయనలో అలాగే ఉందని, ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారని జగన్‌ చెప్పుకొచ్చారు. తనకు తగిలిన దెబ్బలను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అణగదొక్కాలని చంద్రబాబు విపరీతంగా ప్రయత్నించారని, కానీ ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయని జగన్‌ అన్నారు. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబుకు పీకలదాకా కోపం ఉంటుందని చెప్పారు. కాలేజీ రోజుల్లో తనను కొట్టాడనే కోపంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేయాలని, అవకాశం దొరికినప్పుడల్లా బండ వేయాలని చంద్రబాబు చూస్తుంటాడని జగన్‌ పేర్కొన్నారు. ఆ పగతోనే పెద్దిరెడ్డి గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎక్కడికి వెళ్లినా దాడులకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తుంటారని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో(Punganur Constituency) మిథున్ రెడ్డి(Mithun Reddy), మాజీ ఎంపీ రెడ్డెప్ప రెడ్డిపై(Reddeppa Reddy) తెలుగుదేశం పార్టీ(Tdp) నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్‌ గుర్తు చేశారు. రెడ్డెప్ప రెడ్డి కారును తెలుగుదేశంపార్టీ నాయకులు దగ్ధం చేశారని, మిథున్ రెడ్డి కారును ధ్వంసం చేశారని జగన్ చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులే దాడులు చేసి, మళ్లీ మిథున్ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డిపై కేసులు పెట్టడం విచిత్రమని, చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుందని జగన్‌ విమర్శించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story