Discussion in AP : ఆ బలమైన పాదాల ఎఫెక్ట్‌తోనే వర్షాలు లేవు
ఏపీలో వైసీపీ పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడ్డాయని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది వర్షాలు పడడం లేదని గ్రామాల్లో ప్రజల్లో ఒకటే చర్చ జరుగుతోందన్నారు.

People Debate in AP due to lack of rains
ఏపీ(AP)లో వైసీపీ(YSRCP) పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడ్డాయని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(Avinash Reddy) అన్నారు. ఈ ఏడాది వర్షాలు పడడం లేదని గ్రామాల్లో ప్రజల్లో ఒకటే చర్చ జరుగుతోందన్నారు. గడిచిన నాలుగేళ్లు చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్(Nara Lokesh) హైదరాబాద్(Hyderabad) కే పరిమితమవడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. రెండు బలమైన పాదాలు(చంద్రబాబు, లోకేష్).. ఈ ప్రాంతంలో అడుగుపెట్టడంతో వర్షాలు పడటంలేదని చర్చ జరుగుతుందన్నారు. లోకేష్ పాదయాత్ర పేరుతో తిరుగుతుండగా.. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి అంటూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని.. అందుకే వర్షాలు పడడం లేదని ఎద్దేవా చేశారు. ఆ పాదాల ఎఫెక్ట్‌తోనే వేల ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగిందన్నారు.
60 రోజులుగా వర్షం చుక్క పడతేదని.. పంట నష్టాన్ని ప్రభుత్వాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. 1999-2004 మధ్య ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ అడ్రస్ లా ఉండేదని... తర్వాత రాజశేఖరరెడ్డి(Rajashekar Reddy) పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసి, సుభిక్షంగా మారిందన్నారు. మళ్ళీ 2014-19 మధ్య అవే పరిస్థితులు నెలకొంటే.. వైయస్ జగన్(YS Jagan) సీఎం అయ్యాక మొదటి నాలుగేళ్లు సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఏపీలో తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అవినాష్ రెడ్డి అన్నారు.
