- Home »
- andhra pradesh »
- Perni Nani Challenge To Chandrababu Naidu And Pawan Kalyan
Perni Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సవాల్ విసిరిన పేర్ని నాని
మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తే.. ముసలి చంద్రబాబు ఇలా మాట్లాడతాడా
- Written By: Yagnik Published Date - Thu - 18 April 24
తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను బూతులు తిట్టలేదని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియలేదని అన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారి నా కుమారుడిని విమర్శిస్తున్నారన్నారు.
కరోనాలో ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఐసీయూలో కూడా వెళ్లాడని తెలిపారు పేర్ని నాని. కొల్లు రవీంద్ర, చంద్రబాబు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సేవ చేశాడని.. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తే.. ముసలి చంద్రబాబు ఇలా మాట్లాడతాడా అని ప్రశ్నించారు పేర్ని నాని. 5 ఏళ్లలో మచిలీపట్నానికి ఏం చేశానో చెప్పే దమ్ము ఉంది.. మచిలీపట్నం అభివృద్ధి నాడు వైఎస్సార్, నేడు వై.ఎస్. జగన్ హయాంలో జరిగిందని పేర్ని నాని అన్నారు. యూనివర్సిటీ, పోర్టు, మెడికల్ కాలేజీ, 26 వేల ఇళ్ల స్థలాలు తెచ్చింది తామేనని అన్నారు. 2014 లో మచిలీపట్నానికి చెప్పిన ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు అమలు చెయ్యలేదన్నారు పేర్ని నాని. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలేనన్నారు పేర్ని నాని.
-
Sonia Gandhi Family: రెండు దశాబ్దాల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు
-
Karnataka Sex Scandal: ప్రజ్వల్‌ను శ్రీకృష్ణడితో పోల్చిన మంత్రి… భగ్గమంటున్న బీజేపీ
-
Kerala Bus in London : లండన్‌లో కేరళ బస్సు..!
-
Hara Hara veera Mallu: హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ వచ్చాడు!
-
West Bengal : బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
Actress Syamala : గీతను ఓడించడం ఎవరి తరం కాదు.. పవన్‌పై నటి శ్యామల కామెంట్స్
-
YS Avinash Reddy : హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట